Saturday, August 15, 2009

POWER STAR'S NEW MOVIE?


పవన్‌కల్యాణ్ ప్రస్థుతం సినిమాలపైనే తన దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో “పులి” సినిమా తర్వాత పవన్‌కల్యాణ్ చేసే దర్శకుడు ఎవరు అనేదానిపై అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆంజనేయులు నిర్మాత గణేష్ నిర్మించే ఈ చిత్రానికి మొదట పూరీ జగన్నాథ్ అన్నారు. షాక్ దర్శకుడు హారిష్ మంచి సబ్జక్ట్ చెప్పడంతో పూరీ జగన్నాథ్ ప్లేస్ లో హారిష్ అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కిక్ సురేందర్ రెడ్డి ఒక మంచి కథ పవన్‌కల్యాణ్ కు వినిపించినట్టు కొందరు మెగాఫ్యాన్స్ అంటున్నారు.

గణేష్ నిర్మించే చిత్రానికి దర్శకుడు ఎవరనేదానిపై సస్పెన్స్ అలా వుంటే, పవన్ కల్యాణ్ ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇంకో న్యూస్ బయటకు వచ్చింది. ఆ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తారని అంటున్నారు. అశ్వనీదత్ కు పెద్ద హిరోలు కాల్షిట్స్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆ హిరోలు కొరుకునే ప్రఖ్యాత కాస్టలీ దర్శకుడితో ముడిపెడతాడు. ఆ లెక్కన చూసుకుంటే అశ్వనీదత్ సినిమాకు దర్శకధీర”రాజమౌళి” గాని, త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని వుంటారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా పవన్‌కల్యాణ్ సినిమాలపైనే తన దృష్టి పెట్టడం అభిమానులకు ఆనందదాయకం.

No comments:

Post a Comment

HOW IS VEDHAM FILM?

NeoCounter

VISITORS

Search This Blog

Followers

Blog Archive

About Me

IAM A BIG FAN OF CINIMA